KTR | భూములు ప్రజల సొత్తని.. అబ్బ సొత్తు అన్నట్టు, నీ అత్త సొమ్ము అన్నట్టు’ దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మాల్స్, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి వీలుగా వేల కోట్ల రూపాయలు ఆయన అనుయాయులు సంపాదించుకునేందుకు వీలుగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీని తీసుకువచ్చారని కేటీఆర్ విమర్శించారు. వరంగల్‌లో కాకతీయ మెగా కాకతీయ టెక్క్టైల్ పార్క్‌ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ ప్రజలు కూడా ఈ దుర్మార్గాన్ని ఆలోచించాలని రారు. వరంగల్లోనూ రిజిస్ట్రేషన్ ధర తగ్గించి ప్రజల భూములను ప్రభుత్వం అమ్ముతుంది అంటే అనుమతిస్తారా? అంటూ ప్రశ్నించారు.
ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వారిని ఒప్పించి ప్రజల నుంచి సేకరించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కూడా.. హైదరాబాద్‌లో వల్లెనే రైతులకు నుంచి సేకరించిన భూములను రిజిస్ట్రేషన్ ధరల్లో 30శాతంకే అపార్ట్మెంట్లు, మాల్స్ కట్టుకోవడానికి అనుమతిస్తే వరంగల్ ప్రజలు ఒప్పుకుంటారా? ఇది సరికాదు కదా! అన్నారు. హైదరాబాద్ భూములు ప్రజల సొత్తని.. హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తన్నారు. ప్రజావసరాలకే వినియోగించాలని.. హైదరాబాద్ పారిశ్రామిక వాడల కోసం తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములను ప్రజా ఉపయోగం కోసమే, ప్రజల అవసరాల కోసమే వాడాలన్నారు. ప్రైవేట్ వ్యక్తుల అపార్ట్మెంట్లు, విల్లాల కోసం ఈ భూములను ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం కారణం చెప్పడం లేదన్నారు. కాలుష్య కారక పరిశ్రమల తరలింపుపై కేసీఆర్ విజన్ తో ముందుకు పోయారని.. హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలను, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికి కేసీఆర్ ఫార్మా సిటీని ఏర్పాటు చేశారన్నారు.
కొత్త టెక్నాలజీతో, కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా, ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ, వాటిని తరలించి, ఇక్కడ ఉండే ల్యాండ్‌ను అవసరమైతే 50శాతం తిరిగి గవర్నమెంట్ తీసుకోవాలనేది గత ప్రభుత్వం ఆలోచన అంటూ గుర్తుచేశారు. ఈ ప్రభుత్వ ఆలోచన ఏంది? ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా? ఇక్కడ ఉన్న 9,300 ఎకరాలు కూడా అమ్ముకోవాలా? రెండు చోట్లా లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం-పేటీఎంగా మారుస్తూ.. 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా వచ్చే 20-25 ఏళ్లకు వారి ముని మనుమలకు కూడా ఆస్తిని ఆర్జించి పెట్టాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల నుంచి తీసుకున్న భూములను ‘నీ అబ్బ సొత్తు అన్నట్టు, నీ అత్త సొమ్ము అన్నట్టు’ నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని.. ఈ మోసాన్ని అడ్డుకోవడానికి ఒక కార్యాచరణ రూపొందిస్తాం, తప్పకుండా పోరాటం చేస్తామన్నారు. వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే కచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడుతామన్నారు.