KTR | ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటీ? అన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో అటు ఎన్డీఏ, ఇటు ఇండియా తమ తమ అ అభ్యర్థులన్ని ప్రకటించాయి. కానీ, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో ఎవరూ బాస్‌లు లేరు. మాకు ఢిల్లీలో మాకు ఏ బాస్ లేడు. ఏ పార్టీ మా బాస్ కాదు. మా బాస్‌లు ఎవరైనా ఉన్నారంటే.. తెలంగాణ ప్రజలే తప్ప.. మాకు ఢిల్లీలో ఆజ్ఞపించే, ఆదేశించేవారు ఎవరూ లేరు. మా పార్టీని ఇప్పటి వరకు సంప్రదించలేదు. ఈ కూటమి, ఆ కూటమి ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. ఏం ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని.. తమని సంప్రదించింది లేదు. ఇంకా టైమ్ ఉంది. సెప్టెంబర్ 9న ఎన్నిక కాబట్టి.. కూర్చొని ఆలోచించి.. ఎన్నికల తేదీ నాటికి మా వైఖరిని ప్రకటిస్తాం. ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నా. ఏం ఎన్డీఏ కూటమిలో, ఇండియా కూటమిలో లేము. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు చేయాలనే విషయంలో ఢిల్లీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఏ ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదు’
‘మేం తెలంగాణ ప్రజలకు మూడ్‌కు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేవంత్‌రెడ్డి పెట్టిన వ్యక్తి అయితే తాము వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ అనే చిల్లర పార్టీ, థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలను ఎంత అరిగోస పుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి.. థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేం సమర్థిస్తామని మీరెలా అనుకుంటారు? ఇవాళ జరుగుతున్నది అంతా ఒక డ్రామా. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటి వరకు ఇదే రేవంత్‌రెడ్డి ఏమన్నడు ? బీసీల విషయంలో మా పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. బలహీన వర్గాల విషయంలో ఢిల్లీ వరకు కొట్లాడుతాం.. అవసరమైతే అంతరిక్షం వరకైనా కొట్లాడుతం అన్నడు. మరి బీసీని అభ్యర్థిగా ఎందుకు పెట్టలేదు. అంత ప్రేమ ఉన్నప్పుడు బీసీ అభ్యర్థిని పెట్టలేదు. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా? కంచ ఐలయ్యను పెట్టాల్సింది’ అన్నారు.
‘తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని పెట్టి ఇదిగో మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. బీసీలపై ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటది. ఎన్నికల్లో నిలబెట్టే సరికి బీసీలు కనిపించరు మీకు. మీ మాటలు మేం నమ్మాలి.. మీ వెనుకలా నిలబడాలి. మీరేమైనా మెర్బాని చేస్తున్నారా మాకు. మాది స్వతంత్రమైనా పార్టీ. ఎన్డీఏ, ఇండియాలో లేము. మోదీ మా బాస్ కాదు.. రాహుల్ మా బాస్ కాదు. తెలంగాణ ప్రజలు మా బాస్‌లు. వారి ఆలోచన, అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఒకటిమాత్రం వాస్తవం. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే. తెలంగాణను ఇద్దరూ ముంచినవారే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలేదు. 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఆ ఇద్దరు అభ్యర్థులను సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని వ్యక్తిగతంగా నేను అనుకోను. కానీ, నా అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు. పార్టీగా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇన్చార్జీలు, రాష్ట్ర కమిటీ.. అవసరమైతే కేసీఆర్‌తో అభిప్రాయాలు చెప్పి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా మాత్రం కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. రెండు తెలంగాణకు పనికివచ్చే పార్టీలు కాదు. రెండు ఢిల్లీ పార్టీలే, వాటిని పట్టించుకోవాల్సిన, వాటి రాజకీయం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం’ అన్నారు.