హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల( Municipal elections) ప్రచారంలో కారు స్పీడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుడిగాలి పర్యటనలతో కార్యకర్తలలో జోష్‌ను నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా నేడు(ఆదివారం) వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేటతో పాటు తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
అబద్ధపు హామీలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ సర్కారు మోసం చేసిన తీరును ఆయన ఎండగట్టనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతిని ప్రశ్నిస్తూ ఓట్లను అభ్యర్థించనున్నారు.