హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌కు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం రాత్రి చైైన్నెలో ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ ఆయ న ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నదని, దేశ జనాభాలో తెలంగాణ 2శాతం ఉంటే జీడీపీకి 5శాతం సమకూర్చడం గర్వకారణమని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తెలంగాణతో దక్షిణాది రాష్ర్టాల గొంతుకలు పార్లమెంట్లో వినిపించకుండా పోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో ఎలాంటి అన్యాయం జరగదని ఇక్కడి బీజేపీ నాయకులు చెప్పడం విడ్డూరమని చెప్పారు. అదే నిజమైతే మాటలు కట్టిపెట్టి చట్టంలో పెట్టాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ బీదర్‌లో నకిలీ నోట్లు ముద్రించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పంచిపెట్టిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. మంత్రి పదవిలో ఉన్న ఆయనకు కరీంనగర్‌కు ఓ బడి కూడా తేవడం చేతగావడం లేదని కడిగిపారేశారు. ఆదివారం కేటీఆర్ కరీంనగర్లో ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ‘సంజయ్ ఈ సన్నాసి మాటలెందుకు? పనికిమాలిన డైలాగులెందుకు?’ అని నిలదీశారు. అప్పుడు కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని, సంజయ్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టి విచారణ కోరాలని డిమాండ్ చేశారు.