KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ నియోజకవర్గం మరుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలైన నవీన్, ప్రవీణ్ అనే ఇద్దరు దళితులపై స్థానిక ఎస్సై, పోలీసులు దాడి చేసిన ఘటనపై ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తున్నవారిని, అక్రమ కేసులు బనాయిస్తున్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మరుపల్లిలో దాడికి గురైన దళితులతో కలిసి బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పిన కేటీఆర్.. పార్టీ అం డగా ఉంటుందని, లీగల్‌సెల్ ద్వారా న్యా యసాయం అందిస్తామని భరోసా ఇచ్చా రు. అవసరమైతే తాను కూడా వికారాబాద్‌కు వచ్చి ఆందోళన చేస్తానని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, హ్యూ మన్ రైట్స్ కమిషన్‌కూ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎస్సైలు, సీఐలు ఎక్స్‌ట్రాలు వేస్తే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మన మీద దాడులు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తున్నవారి పేర్లు రాసి పెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారికి శంకరగిరి మాన్యాలు పటిస్తామని చెప్పారు.
తన సొంత నియోజకవర్గంలోనే దళితబిడ్డలను పోలీసులు కొడుతుంటే స్పీకర్ పట్టించుకోకపోవటం విచారకరమని కేటీఆర్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, డీజీపీతో మాట్లాడుతానని చెప్పారు. సమావేశంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్, మరుపల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు భట్టు రమేశ్, అ ట్లూరి ఆశోక్, రాచన్న, కౌన్సిలర్ గో పాల్, అనంతరెడ్డి, వికారాబాద్ పట్టణ అధ్యక్షు డు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మర్ చం ద్రశేఖర్‌రెడ్డి, యువత అధ్యక్షుడు మధుకర్, నాయబ్‌గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరుపల్లిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రే గూండా లెక మాట్లాడుతున్నారని, ఆయనను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గూండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కొంతమంది గూండాలను ఎసా ర్ట్ పెట్టి కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి దాడికి పంపారని దుయ్యబట్టారు.