తాడ్వాయి, సెప్టెంబర్16 : లివర్ మార్పిడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా తాడ్వాయి మాజీ జడ్పీటీసీ భర్త పులుసం పురుషోత్తంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు. రెండు సంవత్సరాలు హైదరాబాద్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో తాడ్వాయి మండలం పంబాపురంలో ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్న పురుషోత్తంకు చేయూతనిచ్చారు.
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణబాబు ద్వారా విషయం తెలుసుకున్న కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రూ.5 లక్షలను చెక్కు రూపంలో పంపించారు.