హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కోటి అబద్దాల రేవంత్.. అద్దుమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించిన నువ్వు మహిళలను కోటీశ్వరులను చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్నావని ఫైరయ్యారు. మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్నాడని విమర్శించారు. పేదింటి బిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టాడని, నిండు గర్భిణీల న్యూట్రీషన్ కిట్టును మాయంచేశావని నిప్పులు చెరిగారు. పేదింటి ఆడబిడ్డలకోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మవడిలను ఎత్తేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా అంటూ ప్రశ్నించారు.
తులం బంగారం పేరుతో ఆడబిడ్డల వంచించాడని చెప్పారు. నెలకు రూ.2500 పేరుతో చెవిలో పువ్వులు పెట్టాడన్నారు. స్కూటీల పేరుతో కాలయాపన చేస్తున్నాడని, పింఛన్లకు పంగనామాలు పెట్టాడని విమర్శించారు. బతుకమ్మ చీరలను బందువెట్టిన నువ్వు ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ డమ్మీ పథకాలు గడపలు దాటవు కానీ, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయన్నారు. కోటి రతనాల వీణ తెలంగాణ భవిష్యత్ ఏడాది పాలనతో ప్రశ్నార్థకం చేశావని మండిపడ్డారు. పదేండ్ల కేసీఆర్ పాలనతో భరోసా నిండిన బతుకుల్లో భయం నింపావని, సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావన్నారు. బతుకమ్మ నెత్తిన చేతులే నీ భరతం పడతాయంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘కోటి అబద్దాల రేవంత్ – ఆడబిడ్డలను కోటిశ్వరులను చేస్తావా
అద్దుమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించిన నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
హైడ్రాతో బుచ్చమ్మ పొట్టన పెట్టుకున్న నువ్వు – కోటీశ్వరులను చేస్తావా
మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్న నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
పేదింటి బిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టిన నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
నిండు గర్భిణీల న్యూట్రీషన్ కిట్టును మాయంచేసిన నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
పేదింటి ఆడబిడ్డలకోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మవడిలను ఎత్తేసిన నువ్వు .. కోటీశ్వరులను చేస్తావా
తులం బంగారం పేరుతో ఆడబిడ్డల వంచించిన నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
నెలకు రూ.2500 పేరుతో చెవిలో పువ్వులు పెట్టిన నువ్వు- కోటీశ్వరులను చేస్తావా
స్కూటిల పేరుతో కాలయాపన చేస్తున్న నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
పింఛన్లకు పంగనామాలు పెట్టిన నువ్వు -కోటీశ్వరులను చేస్తావా
బతుకమ్మ చీరలను బందువెట్టిన నువ్వు .. కోటీశ్వరులను చేస్తావా
నీ డమ్మీ పథకాలు గడపలు దాటవు కానీ .. నీ మాటలు కోటలు దాటుతున్నాయి
కోటి రతనాల వీణ తెలంగాణ భవిష్యత్ ఏడాది పాలనతో ప్రశ్నార్థకం చేశావు
పదేళ్ల కేసీఆర్ పాలనతో భరోసా నిండిన బతుకుల్లో భయం నింపావు
సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావు. బతుకమ్మ నెత్తిన చేతులే నీ భరతం పడతాయి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కోటి అబద్దాల రేవంత్ – ఆడబిడ్డలను కోటిశ్వరులను చేస్తావా
అద్దుమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝళిపించిన నువ్వు-కోటీశ్వరులను చేస్తావా
హైడ్రాతో బుచ్చమ్మ పొట్టన పెట్టుకున్న నువ్వు – కోటీశ్వరులను చేస్తావా
మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్న నువ్వు-కోటీశ్వరులను చేస్తావా… pic.twitter.com/ZzAAqknO2h
— KTR (@KTRBRS) December 5, 2024