హైదరాబాద్: తాము అదానీని అసలు ఎంకరేజ్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నీ లెక్క లుచ్చా పనులు చేసి.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో తనను తిడుతున్నావ్ సరే తనకు ఏమీ ఫరక్ పడదన్నారు. ప్రశ్నిస్తే తాను సైకోనా అని ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరి నువ్వు శాడిస్ట్ వా అని నిలదీశారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివని ఫైరయ్యారు. ఏం చేస్తావో చేసుకో, తాము నీకు భయపడేవాళ్ల కాదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మృత్యువుతో పోరాడి చనిపోయిన శైలజకు సంతాపం. గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల మృతికి సంతాపం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే. గురుకులాల్లో పరిస్థితులపై రేవంత్ ఇప్పటివరకు సమీక్ష జరపలేదు. ఆందోళనలో ఉన్న లక్షలాది మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల తరపున రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం, చీల్చి చెండాడుతాం. విద్యార్థులు నిబ్బరంగా ఉండాలి. ఎవరికి అవసరమైనా బీఆర్ఎస్ను సంప్రదించండి. విద్యార్థులను బీఆర్ఎస్ కాపాడుతుంది.
రాహుల్ తిట్టినందుకు రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో మాట్లాడారు. చిట్టినాయుడికి చిప్ దొబ్బినట్లు అనిపిస్తున్నది. అదానీతో బీఆర్ఎస్ అనుబంధం ఉందని రేవంత్ ఆరోపించాడు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా?. రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయా?. ఎంపీగా పనిచేసినోడికి ఈ మాత్రం తెలియదా?. 700 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల ప్రాజెక్టు కూడా కేంద్రానిదే. డ్రైపోర్ట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. కేంద్రం అనుమతి ఇస్తే డ్రైపోర్టు నిర్మాణం జరుగుతుంది.
మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు…. రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడు. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేశారు. నీకు సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటకలుస్తుంది. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయ్యావ్. మైక్రోసాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చింది. ఆమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మేము తీసుకొచ్చాం. నేను అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్‌లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్లో పెట్టాను. నీలాగా ఇంటికి పిలిపించుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు, కోహినూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. నాకు నీలాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదు. ఏదీ చేసిన బజాప్తా చేస్తా. అదానీ మేము అసలు ఎంకరేజ్ చేయలేదు. నీ లెక్క లుచ్చా పనులు చేసే.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాది కాదు. ఫ్రస్ట్రేషన్లో నన్ను తిడుతున్నావ్ సరే నాకు ఏమీ ఫరక్ పడదు. ప్రశ్నిస్తే నేను సైకోనా?. కొండారెడ్డి పల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరి నువ్వు శాడిస్ట్ వా?. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివి. ఏం చేస్తావో చేసుకో. నీకు భయపడేవాళ్ల కాదు మేము.
కొడంగల్‌లో వృద్ధుడైన సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్‌ని వేధించారు. సాయిరెడ్డి ఇంటిముందు గోడ కడితే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. శైలజ కుటుంబానికి పరామర్శకు వెళ్తామంటే మా ఎమ్మెల్యే లక్ష్మిని అడ్డుకున్నారు. కొడంగల్‌లో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారట. రామన్నపేటలో ప్రజలు తిరగబడితే కొడంగల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. అదానీ, అల్లుడు, అన్నలు, బావమరిది కోసం రేవంత్ పనిచేస్తున్నారు. అదానీ గత నెల 14న రేవంత్‌కు చెక్ ఇచ్చాడు. ఇంతవరకు ఆ చెక్ ఎందుకు క్యాష్ చేయలేదు?. అదానీ గజదొంగ అని మొన్న ముంబైలో రేవంత్ మాట్లాడారు. అదానీ గురించి నిన్ననే తెలిసిందని రేవంత్ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదు. వంద కోట్లు వెనక్కి ఇచ్చి వేల కోట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారు. గతంలో అదానీ ఆఫర్‌ను కేసీఆర్ తిరస్కరించారు.
రాహుల్ గాంధీ తిట్టేసరికి రేవంత్ తప్పు ఒప్పుకున్నాడు. బీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక రేవంత్ వెనక్కి తగ్గాడు. మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు. మీడియా మిత్రుడు ఒకరు నిన్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టాలని హైద్రాబాద్ వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిందని ప్రశ్నిస్తే… ఎవడో పుల్లయ్య, మల్లయ్య చెప్పిండు అంటాడు. ఎవరో చెబితే మేం చేయాలా అని రేవంత్ తెలివితక్కువగా మాట్లాడారు. ఎల్లయ్య, మల్లయ్య చెప్పలేదు. ప్రభుత్వంలోని నీ శాఖనే చెప్పిందన్న సోయి కూడా లేదు. రాహుల్, రేవంత్ ఇద్దరిలో ఎవరో ఒకరు పిచ్చోడు.. వాళ్లే తేల్చుకోవాలి. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి రూ.8 కూడా తీసుకురాలేదు. రేవంత్ 28 సార్లు ఢిల్లీకి వెళ్లి రూ.28 కూడా తేలేదు. రేవంత్ ఢిల్లీ వెళ్లేది చీకట్లో రాహుల్ కాళ్లు పట్టుకోవడానికే’నని కేటీఆర్ విమర్శించారు.
Live : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan. https://t.co/CqCJHBkena
— BRS Party (@BRSparty) November 26, 2024