హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్‌తోనే పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని, పెట్టుబడిదారులు తెలంగాణను కాదని గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
ఈ విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పెట్టుబడులకు అయస్కాంతంలా పని చేసిందని, ప్రఖ్యాత కంపెనీలు రాష్ర్టానికి వరుసకట్టాయని పేర్కొన్నారు.