KTR | వరంగల్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
వరంగల్‌కు చెందిన గణేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయాడు. దీంతో అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాడు. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివినప్పటికీ కష్టపడ్డాడు. ఎంబీబీఎస్ సీటు కూడా సాధించాడు. కానీ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ.1.5 లక్షలను కట్టాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీలోపు ఆఫీజును కట్టాల్సి ఉంది. కానీ తల్లిదండ్రులు లేని గణేశ్ ఆ మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేడు. ఒకవేళ సమయానికి ఫీజు కట్టకపోతే సీటు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో గణేశ్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సాయం కోరాడు. దీనికి స్పందించిన కేటీఆర్.. సాయం చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇచ్చిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రూ.1.5 లక్షల సాయం అందజేశారు. భవిష్యత్తులో గణేశ్ చదువులకు తానే అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రామన్న భరోసా
మాట ఇచ్చాడు… నిలబెట్టుకున్నాడు!
వరంగల్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేష్‌కి ఆర్థికంగా అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించినప్పటికీ, ట్యూషన్ ఫీజు కట్టలేని పరిస్థితిలో గణేష్ X (ట్విట్టర్) ద్వారా సాయం కోరాడు.
వెంటనే… https://t.co/GZz3X7xSuV pic.twitter.com/2fBHc9efc1
— BRS Party (@BRSparty) October 6, 2025
*ఆపదని వచ్చే వారిని కాపాడే ధైర్యం..*
*సాయం అంటే వెనకడుగేయని గుణం..*
*కష్టం అని తెలిస్తే… తీర్చే మంచితనం..*అన్నా ఎంబీబీఎస్ సీటు వచ్చింది… చదువుకు కావాల్సిన సాయం అందించు అన్నా అంటే నేనున్నా అని చదువు అయ్యే ఖర్చు అంతా నేను చూసుకుంటా అని అన్న కేటీఆర్ అన్నకి, సాయం… pic.twitter.com/dmexjlS34U
— Dasyam Vinaya Bhaskar (@dasyamofficial) October 6, 2025