KTR | ఏపీలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించించారు. ఈ విషాదకర వార్త తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని, బాధితులందరికీ తన ప్రగాఢ సానుభూతి ఉంటుందన్నారు.
ఇదిలా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రహరీ గోడ బుధవారం వేకువ జామున కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మృతి చెందారు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి టెంట్ ఎగిరిపడం గోడపై పడింది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్‌కు సమీపంలో గోడ కూలిపోయింది. అక్కడే ఉన్న పలువురిపై కూలడంతో సంఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీ బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించింది.