KTR | హైదరాబాద్, అక్టోబరు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల అమానవీయంగా, కర్కశంగా వ్యవహరిస్తుండటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ఢిల్లీలో ఉన్న ప్రస్తుత గాం ధీలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్పందించాలని, డీపీఆర్ అనేది లేకుండా ఇండ్లు కూలగొట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను విరమింపచేయాలని విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం తెలంగాణభవన్‌లో వారి చిత్రపటాలకు కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అ ర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ.. సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నాయనే దాని ని బట్టి ఆ ప్రభుత్వ గొప్పతనం తెలుస్తుందని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు.
తన సత్యాగ్రహంతో భారతజాతినే కాకుండా ప్రపంచాన్ని మేలొల్పిన గొప్ప మహనీయుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. అమెరికాలో మార్టిన్ లూథర్‌కింగ్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మం డేలా లాంటి నాయకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు సమాజంలోని బలహీనుల పట్ల కరశత్వంతో వ్యవహరించొద్దని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించింది నిర్మాణాత్మక పనుల కోసమే కానీ, విధ్వంసం సృష్టించేందుకు కాదనే విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు చెప్పారు.
పేదలంతా బాధపడుతున్నారని, ఇండ్లు కూలగొట్టలేమంటూ కూలీలు తిరిగి వెళ్ళిపోయారని పేర్కొన్నారు. తాము రెండున్నర లక్షల ఇండ్లు కడితే, మిమ్మల్ని 5 లక్షల ఇండ్లు కట్టమని ఓటేశారు తప్ప ఉన్న ఇండ్లను కూలగొట్టేందుకు కాదని కేటీఆర్ తెలిపా రు. ఇండ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, మానవత్వంతో ముందడుగు వేయాలని కోరారు.
కార్యక్రమంలో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రె డ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమ ణ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అనిల్‌జాదవ్, మాజీ ఎంపీలు రావు ల చంద్రశేఖర్‌రెడ్డి, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, భాస్కర్‌రావు, కోరుకంటి చందర్, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, గజ్జెల నగేశ్, చిరుమళ్ల రాకేశ్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, మేడె రాజీవ్‌సాగర్, బీఆర్ఎస్ నేతలు తుంగ బాలు, కడారి స్వామియాదవ్ పాల్గొన్నారు.