హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రజా నాయకుడు, డైనమిక్ లీడర్‌గా మాగంటి గోపీనాథ్ పనిచేశారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శనివారం ఉదయం అసెంబ్లీలో జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపీనాథ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తదని కలలో కూడా అనుకోలేదు. జీవించి ఉన్నం త కాలం ఆయన అనారోగ్యం గురించి చెప్పుకోలేదు. గుంభనంగా ఉంటూ ఆరో గ్య విషయాల్ని రహస్యంగా ఉంచారు. కానీ, పబ్లిక్పరంగా చాలా యాక్టివ్‌గా ఉం డేవారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు’ అని పేర్కొన్నారు. పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కటౌట్ల కల్చర్ గోపీనాథ్దే
హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జన్మించిన గోపీనాథ్ ఎన్టీఆర్‌కు వీరాభిమానికిగా టీడీపీలో అడుగుపెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. బషీర్‌బాగ్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మేము కూడా నివాసం ఉండేది. ప్రస్తుతం ఉన్న అమరజ్యోతి ముందు నిలువెత్తు కృష్ణుడు, రాముడు రూపంలో ఎన్టీఆర్ కటౌట్ ఉండేది.. దాని కింద మాగంటి గోపీనాథ్ అని రాసి ఉండేది. అప్పట్నుంచే తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు. కటౌట్ల కల్చర్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేశారు గోపీనాథ్. ఎన్టీఆర్, కేసీఆర్ నాయకత్వంలో కష్టమొచ్చినా, నష్ట మొచ్చినా పనిచేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సేవలందించారు. బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించే కంటే ముందే.. తన నియోజకవర్గంలో బతుకమ్మ పండుగకు చీర పెట్టే సంస్కృతి తీసుకొచ్చారు గోపీనాథ్. నియోజకవర్గ ప్రజలు ఆయనను గోపన్న అని పిలుచుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గోపీనాథ్‌తో కలిసి తెలుగు యువతలో పనిచేశానని, తనకు దగ్గరి మిత్రుడని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన ఆదర్శ నాయకుడు గోపీనాథ్ అని కొనియాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ గోపీనాథ్ ఏ పార్టీలో ఉన్నా నమ్మకంగా పని చేసేవారని, పార్టీ అధినేతకు విధేయుడిగా ఉన్నారని గుర్తు చేశారు. వివాదాలకు దూరంగా ఉండేవారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ ప్రజలతో మమేకమయ్యేవారని, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పట్టుబట్టలు పెట్టి భోజనాలు పెట్టేవారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఎంతో మందిని ఆయన ప్రోత్సహించారని పేర్కొన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల బలపరిచారు. అనంతరం సభను ఆదివారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.