హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు.
ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటలు నమ్మి యువత కాంగ్రెస్‌కు ఓటేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుయ్యబట్టారు.