నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టు స్వీకరించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదుదారుడు కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్కసుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్ల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. కేటీఆర్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కొండా సురేఖకు కోర్టు అవకాశం కల్పించిం ది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కో ర్టు ఆదేశించినప్పటికీ ఆమె తరఫున న్యాయవాది హాజరై కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం కేసు న మోదు కోసం కోర్టు తీర్పును రిజర్వు చేయనుంది. ఇటీవల సినీనటుడు నా గార్జున దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసును కోర్టు నమోదు చేసుకున్నట్టు మేజిస్ట్రేట్ శ్రీదేవి సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిం దే. కేటీఆర్ దాఖలు చేసిన కేసును కూడా కోర్టు స్వీకరించి ఆమెపై 356 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసే అవకాశం అధికంగా ఉందని సీనియ ర్ న్యాయవాదులు, విశ్లేషకులు అంటున్నారు.