కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మ ఇటీవల మరణించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గంగుల కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కేటీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.
-కరీంనగర్ కార్పొరేషన్