DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. వారి మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
కాగా, డీజీపీ జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ గోయల్.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం మహాప్రస్థానంలో డీజీపీ తల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణ గోయల్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంతాపం ప్రకటించారు.