 
                                                            KTR Birthday | పుట్టిన రోజును పురస్కరించుకుని కేటీఆర్ బుధవారం తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యతో కలిసి నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ తల్లిదండ్రులు కేసీఆర్, శోభమ్మను కలిసి ఆశీర్వాదం అందుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్‌చేసి పంచిపెట్టారు.
అభిమాన నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని కోరుతూ ఆలయాల్లో పూజలు చేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద పేదలకు నగదు సాయం, ల్యాప్‌టాప్‌లు ఇతరత్రా వస్తువులు అందజేశారు. కుట్టుమిషన్లు, చీరలు పంచిపెట్టారు.
కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తల్లిదండ్రులు కేసీఆర్-శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బొకేలు అందజేసి కేటీఆర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు.

బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా నందినగర్ నివాసంలో తల్లిదండ్రులు కేసీఆర్-శోభమ్మ ఆశీస్సులు తీసుకుంటున్న 
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో సతీమణి శైలిమ, కొడుకు హిమాన్షు, కూతురు అలేఖ్య

గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు అందుకున్న విద్యార్థినులతో కేటీఆర్. ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య

గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కుట్టుమిషన్లు అందుకుంటున్న జనగామ జిల్లా లింగాలఘనపురం మండలానికి చెందిన వెయ్యి మంది మహిళలు.

సంబురాల్లో భాగంగా కేక్ కట్ చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి

కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుంటున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ విప్ బాల్క సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్‌గౌడ్ తదితరులు

అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి. చిత్రంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి

నల్లగొండలో జడ్పీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డికి కేకు తినిపిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్. చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి, భూపాల్‌రెడ్డి

కేటీఆర్ జన్మదినం సందర్భంగా భాగ్యశ్రీ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు చీరెలు పంపిణీ చేస్తున్న ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్

కేటీఆర్‌కు పూలబొకేతో శుభాకాంక్షలు చెబుతున్న మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, వీ సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి

కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతున్న ఎమ్మెల్యే మర్రి , కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల..

కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి..

ఖమ్మం నగరంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు
 
                            