హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు హరీశ్‌రావు, మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఇతర నేతల అరెస్టును ఆయన ఖండించారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న నేతలను అక్రమంగా గృహనిర్బంధం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్ పేరుతో రైతుల నుంచి 1,200 ఎకరాల భూమిని బలవంతంగా లాకోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల భూముల పైన పడిందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభు త్వం.. ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. రెండున్నరేండ్లలో ఒక పరిశ్రమను కూడా తీసుకురాని ఈ స రార్, భూములను దోచుకోవడంపై మాత్రం ఆసక్తి చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని, ఉద్యమ కాలం నుంచే ఇవన్నీ ఎదురొని ప్రజల పక్షాన నిలబడ్డామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.