గ్యారీ సోబర్స్ కన్నుమూత
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన వెస్టిండీస్ దిగ్గజ సారథి సర్ గ్యారీ సోబర్స్ (89) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1954 నుంచి 1974 దాకా ఆటలో తనదైన ముద్ర వేసిన సోబర్స్ మృతిని ఆయన కొడుకు డానియెల్‌తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన వెస్టిండీస్ దిగ్గజ సారథి సర్ గ్యారీ సోబర్స్ (89) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1954 నుంచి 1974 దాకా ఆటలో తనదైన ముద్ర వేసిన సోబర్స్ మృతిని ఆయన కొడుకు డానియెల్‌తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. రెండు దశాబ్దాల కాలంలో 93 టెస్టులాడిన సోబర్స్.. 57.78 సగటుతో 8,032 పరగులు చేశారు. ఇందులో 26 శతకాలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్‌గానే గాక ఎడమచేతివాటం మీడియం పేస్, స్పిన్ బౌలింగ్ కూడా చేసే సోబర్స్.. బంతితో 235 వికెట్లు తీశారు.
తన కెరీర్లో ఆయన ఒక్క వన్డే మాత్రమే ఆడారు. 1968లో ఇంగ్లండ్ కౌంటీల్లో నాటింగ్‌హామ్ తరఫున ఆడుతూ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. అదీగాక 1958లో పాకిస్థాన్‌తో టెస్టు ఆడుతూ అత్యధికంగా 365 రన్స్‌తో చరిత్ర సృష్టించారు. 1994లో బ్రియాన్ లారా.. 375 రన్స్ చేసేదాకా సోబర్స్ రికార్డు చెక్కు చెదరలేదు. క్రికెట్లో ఆయన చేసిన సేవలకు గాను 1975లో బ్రిటన్ ప్రభుత్వం సోబర్స్‌కు నైట్‌హుడ్ (సర్) బిరుదును ప్రదానం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

