న్యూఢిల్లీ, జూలై 17 : కీలక రంగాల సూచీకి ఐరన్ ఓర్ ఉత్పాదకతనూ కేంద్ర ప్రభుత్వం జత చేసింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును మరింత సమర్థవంతంగా అంచనా వేయవచ్చని శుక్రవారం తెలిపింది. ఇప్పటిదాకా నెలనెలా కీలక రంగాల సూచీ లెక్కింపునకు 8 ఇండస్ట్రీల (ముడి చమురు, చమురు శుద్ధి, సహజ వాయువు, విద్యుత్తు, ఎరువులు, ఉక్కు, బొగ్గు, సిమెంట్) పనితీరునే ప్రాతిపదికగా తీసుకొనేవారు.
ఇకపై ఇనుప ఖనిజం ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త సిరీస్ గణాంకాలు 2022-23 ఆధారంగా ఉంటాయి. 20న 9 కీలక రంగాల ఫలితాలు విడుదల కానున్నాయి.