పన్నులు చెల్లించకపోతే చర్యలు: మంత్రి పొన్నం
త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులతో ఆయన సమీక్షించిన అనంతరం మాట్లాడుతూ.. రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని సూచించారు.
ఓవర్ లోడింగ్, ఫిట్నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. జూన్ 8 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసిన మొబైల్స్వాడ్ల పనితీరును సమీక్షించారు. స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టంచేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రమేశ్, జేటీసీలు చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

