సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలి.. రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ బృందం
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ ప ర్యటనకు వెళ్లనున్నది.
- కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించనున్న కేటీఆర్, జోగు రామన్న బృందం
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ ప ర్యటనకు వెళ్లనున్నది. బీఆర్ఎస్ వ రింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలోని సీసీఐ సాధన కమిటీ ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసి పరిశ్రమ పునరుద్ధరణపై వినతిపత్రం సమర్పించనున్నది.
ఈ బృందంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు ఉంటారు. ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తున్న సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని బీఆర్ఎస్వర్గాలు సోమవా రం పకటనలో వెల్లడించాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీసీఐ పరిశ్ర మ పునరుద్ధరణ కోసం ప్రయత్నించింద ని, 13 ఏండ్లుగా కేంద్రం నుంచి ఎ లాంటి స్పందన రాలేదని తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

