KTR |హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. కేటీఆర్ వెంట హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి వెళ్లనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడతారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ నేరుగా సిట్ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.