జగిత్యాల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ( Harish Rao ) శనివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు నార్సింగి నివాసం నుంచి జగిత్యాల ( Jagtial ) కు కారులో బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 1 గంటలకు జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ( ప్రజా ఆశీర్వాద సభ ) ఏర్పాట్లను పరిశీలిస్తారని, అనంతరం మీడియాతో మాట్లాడుతారని వెల్లడించాయి . కాంగ్రెస్ మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు.