జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను కేటీఆర్ , హరీశ్ రావు శాలువతో సత్కరించి సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారని తెలిపారు. తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల వల్ల మైనార్టీలకు ఎంత లాభం జరిగిందనేది మీకే బాగా తెలుసు అని అన్నారు. మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో చదివి తల్లిదండ్రులకు, కేసీఆర్ కలను నిజం చేసిన మిమ్మల్ని సన్మానించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ ఇబ్రహీం కుమారుడు ఒబేదు ఎంబీబీఎస్ సీటు సాధించారని అన్నారు.
ఒబేద్ తండ్రి ఇబ్రహీం మాట్లాడుతూ.. ‘ మేం ఒక్కటి నుంచి ఇంటర్మీడియట్ వరకు మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివించాం. కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు మా జీవితాలను మార్చేశాయి. ఈరోజు మా కుమారుడు డాక్టర్ చదువుతున్నాడు. మేము చాలా సంతోషంగా ఉన్నాం.’ అని తెలిపారు. ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని ఒబేద్ తెలిపాడు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీలకు గురుకులాలు నిర్మించి మాకు చదువు చెప్పడం మా అదృష్టమని అన్నాడు. 2016లో మైనార్టీ గురుకులాలో అడ్మిషన్ పొంది ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సాధించామంటే అది కేసీఆర్ వల్లే అని తెలిపాడు.

Ktr Harishrao
జహీరాబాద్ మైనార్టీ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన తాసిల్ కమల్ మాట్లాడుతూ.. నీట్ లో 444 మార్క్స్ వచ్చి గవర్నమెంట్ వనపర్తి లో సీట్ సాధించానని అన్నారు. మైనార్టీ గురుకులాల్లో మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకున్నారని తెలిపారు. నేను ఈరోజు ఎంబీబీఎస్ సాధించానంటే దానికి కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. మేము ఎప్పటికీ కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని తెలిపారు.
రైతు కుమార్తె ఫిర్దోస్ మాట్లాడుతూ.. నేను జహీరాబాద్ మైనార్టీ గురుకులాలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివానని తెలిపారు. మంచి విద్యాబోధన అందించిన కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్పారు.’ మేం అయిదుగురం అక్క చెల్లెళ్లం. ఒక తమ్ముడు ఉన్నారు. మా తండ్రి రైతు. తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి మేము ఫీజులు కట్టి స్కూళ్లలో చదవలేకపోయాం. కేసీఆర్ నిర్మించిన మైనార్టీ గురుకులాల వల్లే నేను చదవగలిగాను. ఈరోజు డాక్టర్ చదువు కూడా చదువుతున్నాను.’ అని అన్నారు.
ప్రియా ఏంజెల్ అని జర్నలిస్ట్ కుమార్తె మాట్లాడుతూ.. ‘ జహీరాబాద్ మైనార్టీ గురుకులంలో చదివి ఎంబీబీఎస్ అడ్మిషన్ సాధించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తిలో ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్ సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 2016లో జహీరాబాద్ మైనార్టీ గురుకులాల్లో అడ్మిషన్ పొంది 5వ తరగతి నుంచి ఉచితంగా ఇంటర్మీడియట్ వారికి చదివించారు. నా తండ్రి జర్నలిస్ట్. సరైన వేతనం లేక ప్రైవేట్ పాఠశాలలో చదివించడం మాకు ఇబ్బందిగా ఉండేది. కొన్ని సమస్య వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. కేసీఆర్ నిర్మించిన గురుకులాల మా జీవితాలను మార్చేసింది. ‘ అని అన్నారు.