BRS | ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయల్దేరారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్ఎస్ పక్షాన వారికోసం పోరాడతామని స్పష్టం చేశారు.
#WATCH | Hyderabad | BRS Working President KT Rama Rao says, “Our demand is that the Govt keeps up its word, forming a welfare board for the autorickshaw drivers, giving Rs 12,000 of subsistence per month and insurance and every aspect that was converted in their election… https://t.co/sGfze2YLjk pic.twitter.com/h6ex5vyIsT
— ANI (@ANI) December 18, 2024
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏటా 12వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది.
ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము
అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంది. ఆటోడ్రైవర్ల… pic.twitter.com/rHiqBbz896
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024
Brs Adjourned Motion