మెట్రో రైల్‌కు అనుసంధానంగా ఉన్న దాదాపు 250 ఎకరాల విలువైన భూములు, ఆస్తులను రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు కట్టబెట్టేందుకు సెచ్ వేసిండు. అందుకే ఎల్అండ్టీని బ్లాక్ మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేసిండు. రేవంత్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎల్అండ్టీ 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నడు. -కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నాటకాల వెనుక దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైల్ ఆస్తులను కొల్లగొట్టే భారీ సామ్ దాగి ఉన్నదని సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో విమర్శలు చేసుకొని, ఢిల్లీలో కలిసినట్టు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్‌రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్‌రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. మంగళవారం నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విసృ్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
మెట్రోకు అనుసంధానంగా ఉన్న 250 ఎకరాల భూములు, ఆస్తులను రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు కట్టబెట్టేందుకు సెచ్ వేశారని, అందుకే ఎల్ అండ్ టీని వెళ్లగొట్టారని చెప్పారు. మెట్రో ఆస్తులు కొల్లగొట్టేందుకు రూ.14 వేల కోట్ల అప్పును రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్ అండ్ టీ కట్టాల్సిన అప్పును రాష్ట్రం ప్రభుత్వం కడుతుందని చెప్పి మెట్రోను దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతిసారీ రేవంత్ చేసే కుంభకోణం గురించి ముందే చెప్తూ హెచ్చరిస్తున్నదని, ఈ సారి కూడా మెట్రో పేరుతో రేవంత్ చేయబోతున్న కుంభకోణం గురించి స్పష్టంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నామని తెలిపారు. మెట్రో వద్ద ఉన్న రూ.30 వేల కోట్ల భూములను భవిష్యత్తులో ఎవరు కొంటారు? ఎవరు అమ్ముతారు? అవన్నీ రేవంత్ కుటుంబ సభ్యులకు ఎలా చేరుతాయో? అన్ని ప్రజల ముందుకు వస్తాయన్నాయని తెలిపారు.
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఇద్దరూ హైదరాబాద్‌లో కొట్టుకుంటున్నట్టు నటిస్తూ, ఢిల్లీలో మాత్రం ఒకటై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఎయిర్ పోర్ట్ మెట్రోను రద్దు చేస్తే, కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారని ఎద్దేవాచేశారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్ నుంచి పటాన్ చెరువు మెట్రోను ఎందుకు ఆమోదం తెలుపలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనసాంద్రత కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్ పోర్టు వరకు ఎలాంటి భూసేకరణ లేకుండా మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని వెంటనే రద్దు చేశారని తెలిపారు. గత ప్రభుత్వ ప్రణాళికలకు ఆమోదం లభించి ఉంటే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి ఉండేదని, లక్షల మంది ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పి ఉండేవని చెప్పారు. కేవలం రేవంత్‌రెడ్డికి ఆలోచన లేక, పరిపాలన ప్రాధాన్యతలు తెలువక మెట్రో రైల్ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మొదలుపెట్టి వదిలేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును 70 శాతానికి పైగా కేసీఆర్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డివి అన్నీ డ్రామాలేనని, హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలెక్కాలంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందేనని స్పష్టంచేశారు.
తుగ్లక్, హిట్లర్ల కలయిక రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ ప్రభుత్వం ఒక ‘అట్టర్ ఫ్లాప్ సినిమా’ నడుపుతున్నదని కేటీఆర్ దెప్పిపొడిచారు. కాంగ్రెస్ 30 నెలల పాలనలో అబద్ధాలు, బూతులు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు. రేవంత్ పరిపాలన హిస్టారికల్ విలన్లయిన తుగ్లక్, హిట్లర్లను గుర్తుకు తెస్తున్నదని విమర్శించారు. హిట్లర్‌లా క్రూరత్వంతో వ్యవహరిస్తూ, తుగ్లక్‌లా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్ణయాలు మారుస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తున్నాడని నిప్పులు చెరిగారు. తుగ్లక్ ఆలోచన విధానం ఉంది కాబట్టే, గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని రకాల ప్రజా ప్రయోజన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, కనీసం తన సొంత ఆలోచన మేరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో రేవంత్‌రెడ్డి ఉన్నాడని దుయ్యబట్టారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేదల ఇండ్లను కూల్చేస్తున్నారని, 1.5 లక్షల కోట్ల అంచనాలతో ఆ ప్రాజెక్టులో అవినీతికి తెరలేపారని విమర్శించారు. గ్యారెంటీలు అమలు చేయడానికి పైసల్లేవనే ప్రభుత్వం, మూసీ ప్రాజెక్టుకు ఇన్ని నిధులు ఎకడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా!
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పడుకోబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఆర్ఆర్ టాక్స్ (రాహుల్ – రేవంత్ ట్యాక్స్) వసూళ్లు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో ప్రతి స్వేర్ ఫీట్‌కు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా పైసలు.. ఓసీ (అక్యుపెన్సీ సర్టిఫికెట్) కావాలన్నా పైసలు.. చివరికి ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా పైసలు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది’ అని వాపోయారు. మున్సిపల్ శాఖలో కొంతమంది ఐఏఎస్ అధికారులు చివరికి బ్రోకర్లుగా మారిపోయారని చెప్పారు. బిల్డర్లు పర్మిషన్ల కోసం వెళ్తే సదరు అధికారులు సీఎం కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లను కలువాలని పురమాయిస్తున్నారని మండిపడ్డారు. అకడ డబ్బులు కడితేనే ఇకడ క్లియరెన్స్ ఇస్తామని ఐఏఎస్ అధికారులు చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అరికెపూడి గాంధీకి సవాల్
బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన అవినీతి, అక్రమాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లోకి మారారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఆయనే గతంలో పదేండ్ల బీఆర్ఎస్ కాలంలో ఒక శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ.9,500 కోట్లతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల నివేదికను విడుదల చేశారని గుర్తుచేశారు. మరి రెండేండ్లలో ఎన్ని డబ్బులు నియోజకవర్గానికి తెచ్చారో ఎమ్మెల్యే గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలంటే కార్యకర్తలంతా కలిసికట్టుగా కదం తొకాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతిఒకరూ ఎప్పుడు క్యాలెండర్లో తేదీలు మారుతాయా? ఎప్పుడు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారా? అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఎస్ఐఆర్పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాదవరం కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఆడబిడ్డల ఖాతాల్లో జమ చేస్తే రాజకీయ సన్యాసం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రతిమహిళకూ నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ లెకన ఐదేండ్లకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికే 30 నెలలు గడిచిపోయాయని, అంటే ఒకో మహిళకు రూ.75 వేల చొప్పున ప్రభుత్వం బకాయి పడిందని చెప్పారు. తెలంగాణలోని కోటీ 67 లక్షల మంది తెల్లరేషన్ కార్డు కలిగిన ఆడబిడ్డలందరికీ ఈ రూ.75 వేల బకాయిలను తక్షణమే రేవంత్‌రెడ్డి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘అలా గనుక మీరు ఖాతాల్లో జమ చేస్తే, నేను నా రాజకీయ సన్యాసానికి సిద్ధం’ అని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డికి ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహాలక్ష్మీ కింద మహిళలకు సూటర్లు, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు రూ. 2,016 పెన్షన్లు సక్రమంగా వచ్చేవని, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలతో ఆడబిడ్డలను ఆదుకున్నామని స్పష్టం చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని, హైదరాబాద్ నగరంలో పుత్తడి గొలుసుల దొంగల ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గొర్రెల మందలా కొనుగోలు చేస్తూ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను లాకున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్ -పటాన్చెరు మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలుపలేదు? ఉత్తరప్రదేశ్‌లోని చిన్నచిన్న నగరాలకు మెట్రో ప్రాజెక్టులు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపింది. రేవంత్, కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో కొట్టుకుంటున్నట్టు నటిస్తూ, ఢిల్లీలో మాత్రం ఒకటై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నరు. -కేటీఆర్