హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులర్పించారు. కోకాపేటలోని క్రిన్స్విల్లాస్లో ఉన్న ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ.. హరీశ్ రావును ఓదార్చారు. సత్యనారాయణ రావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మెతుకు ఆనంద్, హరీశ్ రావును పరామర్శించారు. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.