హైదరాబాద్: తుఫాన్లకు పేరు పెట్టే విషయం తెలిసిందే. అయితే ఈసారి బంగాళాఖతంలో ఏర్పడిన తుఫాన్‌కు మొంథా అని పేరు పెట్టారు. మొంథా అంటే అందమైన, పరిమళభరితమైన పుష్పం అని అర్థం. అత్యంత ప్రళయ భీకరంగా దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. మొంథా అనే పదం థాయ్‌ల్యాండ్‌కు చెందినది. హిందూ మహాసముద్రంలోని ఉత్తర భాగంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పలు దేశాలు సూచించిన పేర్లను పెడుతుంటారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. మొంథా తుఫాన్‌గా బలపడి దూసుకొస్తున్నది. 2020లో తయారు చేసిన లిస్టు ఆధారంగా తాజా తుఫాన్‌కు ఈ పేరును ఫిక్స్ చేశారు.
ఆరు ప్రాంతీయ వాతావరణ శాఖల సమన్వయంతో భారతీయ వాతావరణ శాఖ తుఫాన్లకు నామకరణం చేస్తుంది. పేర్లు పెట్టే బాధ్యత ఐఎండీ వద్ద ఉన్నది. రీజినల్ స్పెషలైజ్డ్ మెటియోరోలాజికల్ సెంటర్స్(ఆర్ఎస్ఎంసీఎస్)లో ఆరు ఆదేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇరాన్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిల్యాండ్ దేశాలు తుఫాన్ల కోసం కొన్ని పేర్లను రిజిస్టర్ చేస్తాయి. అయితే రొటేషన్ విధానంలో ఆ దేశాలు సమర్పించిన పేర్లను తుఫాన్లకు పెడుతుంటారు. ఈ ప్రాంత తుఫాన్లకు పేర్లు పెట్టే ప్రక్రియ 2004లో ప్రారంభమైంది.
ఏ సమయంలో తుఫాన్‌కు పేరు పెట్టాలన్న నిర్దేశిత అంశాలు ఉంటాయి. ఆ తుఫాన్ వాయు వేగం 34 నాట్స్ లేదా గంటకు 62 కిలోమీటర్ల వేగం లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే, అప్పుడు ఆ తుఫాన్‌కు పేరును ప్రతిపాదిస్తారు. దీనిపై ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణశాఖ అధికారిక ప్రకటన చేస్తుంది. డబ్ల్యూఎంవో-ఈఎస్సీఏపీ ప్యానల్‌కు సమర్పించిన లిస్టులో మొంథా పేరు ఉన్నది. 2020లోనే ఈ పేరును సమర్పించినట్లు తెలుస్తోంది.
తుఫాన్లకు పేరు పెట్టే అంశంలో కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రాజకీయపరమైన, మతపరమైన, సాంస్కృతిక పరమైన పదాలను, పేర్లను వాడరాదు. ఒక వర్గాన్ని అవమానిస్తున్నట్లుగా కానీ, ద్వేషిస్తున్నట్లుగా కానీ ఆ పేరు ఉండకూడదు. పేర్లు పలకడానికి చాలా సులువుగా ఉండాలి, ఆ పదంలోని అక్షరాల సంఖ్య 8 దాటవద్దు. ఒకసారి వాడిన పదాన్ని మళ్లీ రిపీట్ చేయకూడదు. తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల ప్రపంచదేశాల అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని, అధికారులు, ప్రజలు అప్రమత్తమవుతారన్న ఉద్దేశంతో నామకరణం చేస్తారు. వార్నింగ్ ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది.
A)Cyclonic Storm “Montha” [Pronunciation: Mon-Tha] over Westcentral Bay of Bengal* The Cyclonic Storm “Montha” [Pronunciation: Mon-Tha] over westcentraland adjoining southwest Bay of Bengal moved north-northwestwards with a speedof 15 kmph during past 6 hours and lay centered at… pic.twitter.com/iOcwV9zSNq
— India Meteorological Department (@Indiametdept) October 27, 2025