KR Suresh Reddy | రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. ప్రస్తుతం ఫ్లోర్‌లీడర్‌గా కే కేశవరావు కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో కేఆర్ సురేశ్‌రెడ్డిని నియమిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభ, లోక్‌సభ సెక్రెటరీ జనరల్స్‌కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు విడివిడిగా లేఖ రాశారు. మొన్నటి వరకు ఫ్లోర్ లీడర్‌గా కొనసాగిన కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.