హైదరాబాద్ : వ్యవసాయ మోటర్లకు మీటర్ల(Smart meters) గురించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పినవన్నీ అసత్యాలే. స్మార్ట్ మీటర్ల ఒప్పందంతో విద్యుత్ వినియోగదారునికి గుదిబండగా మారనుందని గతం నుంచి కేసీఆర్ చెబుతూనే ఉన్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు. అ సెంబ్లీలో స్మార్ట్ మీటర్లపై రేవంత్ రెడ్డి చేసిన అసత్యాలపై స్పందించారు. గతంలో ఆర్థికంగా రూ.30 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ కేంద్రం తెచ్చిన రైతు కంటక ప్రతిపాదనని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మేడపై కత్తి పెట్టి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని, ఎన్ని రకాలుగా ఒత్తిళ్ల కు గురిచేసినా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులో మోటర్లకు మీటర్లు పెట్టబోమని కరాఖండిగా తెల్చిచెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతా రనే మాట నేడు నిజం కాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొట్టి తెలంగాణను కాపాడుకోవాలన్నారు.