హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అసాధ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలమైతే.. బీఆర్ఎస్ది తెలంగాణ భావజాలమని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీజేపీలో విలీనంపై సీఎం చేసిన కామెంట్స్‌ను కొట్టిపారేశారు. ఆయన మాటలు ఇయర్ ఆఫ్ ది జోక్ అని ఎద్దేవా చేశారు. సీఎం రమేశ్ ఎప్పుడు బీజేపీలో చేరారు? ఆయన పరపతి ఎంత? అని ప్రశ్నించారు. చెత్త మాటలు కట్టిపెట్టాలని చెప్పారు.