హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ సర్కారు రూ.300 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని లెక్కలు సహా వెల్లడించిన హరీశ్‌రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆయన స్థాయి మరచి మాట్లాడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.