ధర్మారం, మే 8 : రాజకీయాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం కేంద్ర మంత్రి బండి సంజయ్ నైజమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయనమీడియాతో మాట్లాడారు. గురువారం కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ నాయకులు దాడి పాశవిక, ఆటవిక చర్యగా అభివర్ణించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పనికి రాని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బీజేపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ దేశస్థాయిలో విభేదాలు ఉన్నట్టు నటిస్తున్నాయని, రాష్ట్రంలో మాత్రం ఒక్కటేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, మక్కలు కొనుగోలు చేయకపోయినా బండి సంజయ్ మాట్లాడక పోవడం దేనికి నిదర్శమని ప్రశ్నించారు.