హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్‌ను షేర్ ఆటో వాడినట్టు వాడేస్తున్నారు. కొందరు మంత్రులు హెలికాప్టర్ (Helicopter) దిగడం లేదు. హైదరాబాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లాలన్నా, రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతాల్లో పర్యటించాలన్నా గాలిమోటర్లోనే వెళ్తున్నారు. ఈ వాడకం ఎలా ఉందంటే కనీసం 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం కూడా ఛాపర్‌లోనే వెళ్లివస్తున్నారు. తాజాగా సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) పర్యటన కూడా చర్చకు దారితీసింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి వెల్లడానికి కూడా ఆయన హెలికాప్టర్‌నే ఉపయోగిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఫిల్మ్ సిటీలో ఓ సినిమా ప్రారంభంత్సవానికి మంత్రి కోమటిరెడ్డి హాజరుకానున్నారు. దీనికోసం ఆయన బేగంపేట నుంచి పెద్దఅంబర్‌పేటలో ఉన్న ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్లీ బేగంపేటకు తిరిగిరానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో కలసి బేగంపేట నుంచి సూర్యాపేటకు ఛాపర్‌లోనే వెళ్లనున్నారు. అయితే హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న పెద్దఅంబర్‌పేటకు పోయి రావడానికి కూడా హెలికాప్టర్‌ను ఉపయోగించడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10, 20 కిలోమీటర్ల దూరం కార్లలో వెళ్లిరావడాని కంటే హెలికాప్టర్లోనే తక్కువ ఖర్చవుతుందేమోనని చర్చించుకుంటున్నారు.
KTR | షేర్ ఆటో వాడినట్టు.. హెలికాప్టర్‌ను వాడుతున్నరు.. రేవంత్ కేబినెట్‌పై కేటీఆర్ విమర్శలు
Telangana | మంత్రుల మధ్య గాలిమోటర్ రచ్చ.. కొందరే ఎక్కువగా వాడుతున్నారని ఇతరుల అసంతృప్తి