Komatireddy Venkat Reddy | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): వరి పంట బోనస్ అందరికీ ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. బోనస్ బోగస్ అయ్యిందని, 25 శాతం రైతులకే బోనస్ అందిందని పల్లా చెప్పగా.. కల్పించుకున్న కోమటిరెడ్డి రూ.250 కోట్లకు పైగా బోనస్ బకాయిలున్నాయని, త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కాళేశ్వరం బంద్ అవడంతోనే నీళ్లకు ఇబ్బంది: రాంచందర్‌నాయక్ కాళేశ్వరం ప్రాజెక్ట్ బంద్ అవడంతోనే రాష్ట్రంలో నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్‌నాయక్ అసెంబ్లీలో తెలిపారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. కాళేశ్వరం బంద్ కావడంతో వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు.