హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భీభత్సమైన వర్షాలు, వరదతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం శాసనసభ లాబీల్లో మీడియాతో ఆయన మాట్లాడారు.