హైదరాబాద్, మే 27 (నమ స్తే తెలంగాణ): రాష్ట్రాన్ని పెట్టుబడులకు గేట్వేగా మార్చిన ఘ నత ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌దేనని రాష్ట్ర పోలీసులు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రశంసించారు.
రెండు వారాలు గా యూకే, యూఎస్‌లలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించి 42 వేల ఉద్యోగాల కల్పనకు కృషి చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం వల్లే పారిశ్రామిక అభివృద్ధిలో విప్లవాత్మక ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.