దామరగిద్ద, ఆగస్టు 26 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈనెల 8న నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి నుంచి నిర్వహించిన పాదయాత్రలో రైతులు, మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన మంగళవారం గడిమున్కన్పల్లి, కాన్కుర్తికి చెందిన 8 మంది రైతులను పీఎస్కు పిలిచి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో కోల్పోయే భూములకు న్యాయపరమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.