మాదాపూర్, మే 18: ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది. మాదాపూర్‌లోని టీహబ్‌లో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్-2023 కార్యక్రమంలో కేఎల్‌హెచ్ హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు.
హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించి 50కి పైగా సాంకేతిక కార్యక్రమాలను యూనివర్సిటీ నిర్వహించినట్టు రామకృష్ణ తెలిపారు. సీఎస్ఐ అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.