హైదరాబాద్ : బొగ్గు కుంభకోణం ( Coal Scam ) వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR) ఆరోపించారు. పట్టపగలే దొంగనం చేసిన వ్యక్తి తాను దొంగతనం చేసిన అని చెప్తాడా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ( CBI ) విచారణకు ఆదేశిస్తామని పేర్కొనడాన్ని తప్పుబట్టారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు గుండాలతో కలిసి భూ కబ్జాలు చేస్తుంటే దాని మీద సిట్ ఉండదు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని ఆధారాలతో సహ బయటపెడితే దాని మీద కూడా సిట్ ఉండదని ఎద్దేవా చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ బక్వాస్ కేసని కొట్టిపారేశారు. రేవంత్ తుగ్లక్ కార్యక్రమాలను మానుకోవాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సిద్ధం
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్వసన్నద్దంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రతి మునిసిపాలిటీకి సీనియర్ నాయకులను ఇన్చార్జులుగా కూడా వేసుకోబోతున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు.