Kishan Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తేతెలంగాణ): ప్రజలకు హామీలిచ్చే ముందు కేంద్రాన్ని అడిగే ఇచ్చారా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హామీలు అమలు చేయడం చేతగాకే ప్రాజెక్టులు అడ్డుకుంటున్నానని తనపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు.
మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నయాపైసా లేదని తెలిపారు. రేవంత్‌రెడ్డికి పాలనపై, రాష్ట్ర సమస్యలపై కనీస అవగాహనలేదని ఎద్దేవా చేశారు. అందుకే నోటికొచ్చిన తీరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.