జాతీయ హోదా ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా.. సీఎం రేవంత్‌రెడ్డి తన పేరును మారుస్తూ మాట్లాడటం దారుణమని మండిపడ్డారు.
- పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా.. సీఎం రేవంత్‌రెడ్డి తన పేరును మారుస్తూ మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. ఇంత దిగజారుడు రాజకీయాలు తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను కేసీఆర్‌కు దత్తపుత్రుడిని అని రేవంత్ అంటున్నారని, తాను ఎవరికీ దత్తపుత్రుడిని కాదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆరుగ్యారెంటీలు, 420 హామీల గురించి సీఎం రేవంత్ మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు.
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నిందని.. అందులో భాగంగానే బీజేపీ అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్పపై తీవ్ర ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేసి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు అని విమర్శించారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

