వయస్సు చిన్నది.. ఆలోచన పెద్దది
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవిస్తున్నారు
మెదక్, నమస్తే తెలంగాణ: చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి యశ్వంత్, దీపిక ఇద్దరు సంతానం. తల్లిదండ్రులిద్దరూ నగరంలో ఉంటున్నా పిల్లలు మాత్రం హవేళీఘనపూర్లోనే చదువుకుంటున్నారు.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వినూత్న ఆలోచన చేశారు. గతంలో తమ తండ్రి వినియోగించిన ఆటో ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఆటో టాప్‌ను తీసివేసి దానిని మొబైల్ నిమ్మరసం బండిగా మార్చేశారు. రోడ్డు పక్కనే వాహనాన్ని నిలిపి జ్యూస్ విక్రయిస్తూ సంపాదిస్తున్నారు. ఈ పిల్లల ఆలోచనను స్థానికులు అభినందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- financially
- kids
- Parents
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

