భద్రాద్రి: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రాములు నాయక్ శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఆలయం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ప్రజాప్రతినిధులకు వేదాశీర్వచనం అందించారు.