ఇటీవల ముంచెత్తిన మున్నేరు వాగు వరదల్లో చిక్కుకున్న కాంప్లెక్స్ ఇది. ఖమ్మం పట్టణం బొక్కలగడ్డలోని ఈ కాంప్లెక్స్ వాసులకు చివరకు మిగిలింది ఇవే. వానలు, వరదల్లో పాడైపోగా మిగిలిన వాటిని బుధవారం ఇలా ఆరబెట్టారు
కర్ణగిరిలోని రాజీవ్‌గృహకల్పలో కి నీళ్లు చేరడంతో ఫ్రిజులు, టీవీలు, కూలర్లు వంటివన్నీ పాడైపోయాయి. అలా పాడైపోయిన ఫ్రిజ్‌లను ఆరుబయట ఆరబెడుతున్న మహిళలు
మొన్నటి భారీ వర్షాల ధాటికి కన్నీటి సంద్రమైన ఖమ్మం పట్టణం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. వానల్లో, వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులు పాడైపోయిన వస్తువులను బాధాతప్త హృదయంతో పాత సామాన్ల దుకాణాలకు తరలిస్తున్నారు. కొద్దోగొప్పో మిగిలినవాటిని ఆర బెట్టుకుంటూ, శుభ్రం చేసుకుంటూ జీవనయానం సాగించేందుకు సిద్ధమవు తున్నారు.
బొక్కలగడ్డలో వరదల కారణంగా ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని పుస్తకాలు, రికార్డులు తడిసిపోయాయి. తన బిడ్డ భవిష్యత్‌కు ఎంతో విలువైన పుస్తకాలను ఆరబెడుతున్న ఓ తండ్రి
మున్నేరు వాగు మిగిల్చిన దుఃఖం ఇది. వరదల్లో పాడైపోయిన విలువైన వస్తువులన్నీ ఇలా భారంగా పాత సామాన్ల దుకాణానికి వెళ్తున్నాయి
వీరికి సొంత గూడు లేదు. జూబ్లీపురాలో అద్దె ఇంట్లో కాపురం చేస్తున్నారు. మొన్నటి వరదలు సర్వం ఊడ్చేయడంతో ఇక అక్కడ ఉండలేక, మిగిలిన కొద్దిపాటి సామాన్లతో చంటి బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని తరలిపోతున్న ఇల్లాలు