హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల-రాయినిగూడెం మధ్య ఫె్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిలో టేకుమట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు ఈ హైవేను దాటేందుకు సూర్యాపేట వైపు రాయినిగూడెం గ్రామం వరకు సుమారు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నది.
ఇది వాహనదారులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారింది. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవా ణా శాఖ మంత్రి నితిన్ గడరీని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వయంగా పలుమార్లు కలిసి వినతులు ఇవ్వడంతోపాటు లేఖలు రా శారు. ఎంపీ విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి ఫె్లైఓవర్ మంజూరు చేశారు. నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏ) త్వరలో ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నది. తన విజ్ఞప్తి మేరకు ఫె్లైఓవర్ మంజూరు చేయడం పట్ల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.