దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకం కలిగించే కుట్ర
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు.
- వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్విన అధికారులు
- ఎమ్మెల్యే వేముల హెచ్చరికతో కదిలిన యంత్రాంగం
- నిజామాబాద్ రూట్లో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు
జగిత్యాల, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు. దీనిపై మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసి, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది.
ఆగమేఘాల మీద అప్రోచ్‌రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. సోమవారం మధ్యాహ్నం వరకు రోడ్డుపై రాకపోకల పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడంతో కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తొలగినట్టే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

