తిరుమలాయపాలెం, ఏప్రిల్ 17: కోర్టుల వేస్తున్న మొట్టికాయలే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలిచాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న సభకు వెళ్లేముందు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మెలపై గులాబీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్ ప్రణాళికపై సభలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ప్రజలు తరలిరావాలని కోరారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జల్లేపల్లి నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉపేందర్, సుధాకర్‌కు నాయకులు గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు.